కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొల్లాబొత్తుల నవీన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు 8 మందితో ఆటోలో యానాం వెళ్లారు. వేడుకల అనంతరం పాశర్లపూడికి తిరిగి వస్తుండగా చేపల లోడుతో వస్తున్న లారీ, వీరి వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో కోనసీమ జిల్లా నగరం గ్రామానికి చెందిన సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, పి.గన్నవరం మండలానికి చెందిన వల్లూరి అజయ్, మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన నల్లి నవీన్ కుమార్ ఉన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025