April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

రెస్కో మాజీ అధ్యక్షుడు అరెస్టు



కుప్పం టౌన్‌ : రూరల్‌ ఎలక్ట్రిక్‌ కో – ఆపరేటివ్‌ సోసైటీ లిమిటెడ్‌ (రెస్కో) మాజీ అధ్యక్షులు సెంథిల్‌ కుమార్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెస్కో అధ్యక్షులుగా కొనసాగిన ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడ్డారని, రెస్కో సంస్థలో వందల కోట్ల రూపాయలు అక్రమంగా దోచేశారని, అడ్డదారిలో ఉద్యోగులను నియమించి, వారి నుంచి లక్షల రూపాయలు వసూలుకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. కుప్పం పోలీసులు సీర్‌.నెం. 271/2024, 420, 406, 468, 409 ఐపిసి ఆర్‌ / డబ్లుయూ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. టిడిపి అధికారం చేపట్టిన తర్వాత సహకార శాఖ ప్రత్యేక అధికారులు రెస్కో సంస్థలో విచారణ నిర్వహించారు. ఈ క్రమంలో రెస్కో మాజీ అధ్యక్షులను ఏ వన్‌గా చూపుతూ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆయనను తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పట్టణ సిఐ జిటి నాయుడు తెలిపారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via