రెంటచింతల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా డయేరియా ప్రభలింది. రెంటచింతల మండలంలో ఆదివారం డయేరియాతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని వడ్డెర బావికి చెందిన పేరూరి చిన్నచంద్రయ్య (72) శనివారం మధ్యాహ్నం నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా కుటుంబీకులు స్థానిక మెడికల్ షాప్లో మందుల తెచ్చి ఇచ్చారు. పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. చంద్రయ్య ఇంటికి ఎదురుగా ఉండే యామర్తి తిరుపతమ్మ, ఆమె కుమార్తె హవేలీ, సమీపంలో నివాసముండే ఆత్మకూరి లక్ష్మయ్య డయేరియా బారిన పడటంతో వారిని హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించారు. మాచర్లలోని ప్రయివేటు ఆస్పత్రిలో ఇద్దరు, పిడుగురాళ్లలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వర్షాల నేపథ్యంలో బోర్లలో నీరు కలుషితమైందని, ఆ నీటిని తాగడంవల్లే డయేరియా బారిన పడ్డారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకులను ఏళ్ల తరబడి శుభ్రం చేయకపోవడమూ మరోకారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే గ్రామంలోని రైలుపేట ప్రాంతంలో కొద్ది వారాల కిందట కొంతమంది డయేరియా బారిన పడగా వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
Also read
- రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం కాదు.. ఆశ్చర్యపరిచే అసలు కారణాలు ఇవే!
- మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర కారణాలు!
- Weekly Horoscope: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్! 12 రాశులకు వారఫలాలు
- Telangana: ఫోన్కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!





