April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeViral

VIDEO: ఏపీలో రేవ్ పార్టీ కలకలం.. బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తూ..


తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే ఆ పార్టీ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేస్తున్నారు.





ఏపీలో రేవ్ పార్టీ కల్చర్ ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ జరిగిందన్న వార్త కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో మహిళలు నగ్నంగా డ్యాన్స్ చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అధికార పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ నిర్వహించాని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు.

Also Read

Related posts

Share via