SGSTV NEWS online
CrimeNational

రేప్ చేసి, జననాంగంలో ఇనుప రాడ్ జొప్పించి…

• గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస  కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్ జిల్లాలోని ఝగాడియా పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కుటుంబం జార్ఖండ్ నుంచి వలసవచ్చింది.

నిందితుడు విజయ్ పాశ్వాన్ బాలిక తండ్రితోపాటు పనిచేస్తున్నాడు. సమీప గుడిసెలో ఉంటూ బాలికను కిడ్నాచ్చేసి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పొదల్లోకి తీసుకెళ్లి రేప్చేసి పారిపోయాడు. రక్తమోడుతూ బాలిక ఏడుస్తుండటంతో తల్లి చూసి ఆస్పత్రకి తరలించింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాలికను అతను గత నెలలోనూ రేప్ చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది.

Also Read

Related posts