SGSTV NEWS
Andhra PradeshCrime

కుమార్తెపై తండ్రి అత్యాచారం– ఆలస్యంగా వెలుగులోకి



నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్యం మత్తులో కుమార్తెపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ వార్డులో నివాసం ఉంటున్న నరేష్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యను గల్ఫ్‌కు పంపించిన నరేష్‌ రోజువారి పనులకు వెళ్లేవాడు. మద్యం మత్తులో తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె (13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో బాధితురాలితో పాటు విషయం తెలిసిన ఆమె అక్క సైతం భయపడి ఎవరికీ చెప్పలేదు. ఇదే అలుసుగా తీసుకున్న నిందితుడు ప్రతిసారీ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల బాధితురాలి తల్లి గల్ఫ్‌ నుంచి రావడంతో కుమార్తెలిద్దరూ తండ్రి నిర్వాహకాన్ని చెప్పి భోరుమన్నారు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read

Related posts