SGSTV NEWS online
Andhra PradeshCrime

భార్యతో గొడవ.. అడొచ్చిన అత్తను చంపిన అల్లుడు



నంద్యాల : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అత్తను అల్లుడు కత్తితో పొడిచి చంపాడు. బండి ఆత్మకూరు మండలం కాడమలకాల్వ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన సునీల్ ఆమెను హత్య చేసేందుకు కత్తితో వెంటాడాడు. ఈ క్రమంలో అత్త కళావతి అడ్డు రావడంతో ఆమెను చంపేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు

Also read

Related posts