హైదరాబాద్: చార్మ్ బ్యూటీ స్పా సెంటర్పై దాడి చేసి ఆరుగురు
మహిళలను, ఒక విటుడుని, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు, యాంటి ఉమెన్ ట్రాఫిక్ సైబరాబాద్ టీం ఆధ్వర్యంలో దాడి చేశారు. భాగ్యనగర్కాలనీలోని చార్మ్ బ్యూటీ స్పా సెంటర్ను నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులు దాడి చేసి ఆరుగురు మహిళలను, విటుడిని, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 స్మార్ట్ ఫోన్లు, రూ.9100 నగదు స్వా«దీనం చేసుకున్నారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. జగద్గిరిగుట్టకు చెందిన నిర్వాహకురాలు (31), మలక్ పేటకు చెందిన సబ్ ఆర్గనైజర్ (36)ని, గుంటూరుకు చెందిన జయప్రకాష్ (25)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





