వరల్డ్ వన్ స్కూల్‌లో రూ.7.85 లక్షలు చోరీ
మియాపూర్: మియాపూర్ పరిధిలోని ఓ పాఠశాలలో రూ.7.85 లక్షల నగదును చెడ్డీ గ్యాంగ్ దొంగిలించుకుపోయింది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూ హాపీజ్ పేట వరల్డ్ వన్ స్కూల్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలోంచి పాఠశాలలోకి చొరబడి రిసెప్షన్‌లో లాకర్‌ను పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు.
ఆదివారం ఉదయం పాఠశాల సిబ్బంది వచ్చి చూడగా లాకర్ పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి నల్లటి మాస్క్‌లను ధరించి, చెడ్డీలు వేసుకుని శనివారం అర్ధరాత్రి పాఠశాలలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





