April 26, 2025
SGSTV NEWS
Andhra PradeshAstrology

నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య



నెల్లూరు: నగరంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు  పాల్పడ్డారు. నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సింహపురి లాడ్జిలో పాయిజన్ తీసుకుని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాజమండ్రి కొవ్వూరుకు చెందిన జోసెఫ్ (25), కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఆటపాక గ్రామానికి చెందిన శ్రావణి (23)గా పోలీసులు గుర్తించారు.

మూడు రోజుల క్రితం ఉద్యోగ నిమిత్తం కౌన్సిలింగ్కి వచ్చామన్న కారణం చూపి సింహపురి లాడ్జిలో జోసెఫ్, శ్రావణిలు రూమ్ తీసుకున్నారు. రెండు రోజుల నుంచి గదిలో నుంచి బయటకు రాకపోవడంతో పాటు వాసన వస్తుండడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

Share via