April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రవీణ్ ది హత్య కాదు యాక్సిడెంట్.. మద్యం మత్తులోనే: సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!


పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు.

Paster praveen: పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని నేతాజి నగర్ ఇంటినుంచి బయలుదేరిన ఆయన.. రాజమండ్రి చేరుకునే లోపు మూడుసార్లు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీపుటేజీ ఆధారాలు వెల్లడించారు. అంతేకాదు మూడుసార్లు యాక్సిడెంట్ జరిగిందని, తనకై తానే బైక్ అదుపుతప్పి పడిపోయినట్లు వీడియోలు బయటపెట్టారు.


ఒక పెట్రోల్ బంకులోనూ మద్యంమత్తులో ఉన్న ప్రవీణ్ బైక్ నడపలేక తడబడుతున్నట్లు కనిపించింది. బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలోనూ బైక్ హ్యాండిల్ కు బదులు పెట్రోల్ పైపును పట్టుకున్నారు. తన వెనకాల ఉన్న లగేజ్ జారిపడిపోతున్న పెద్దగా పట్టించుకోలేదు. మరోచోట టీ తాగినపుడు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు గుర్తించి బైక్ పై వెళ్లొద్దని, కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన వినకుండా అలాగే బైక్ పై వెళ్లారు. చివరగా అర్థరాత్రి 11 తర్వాత అతి వేగంగా వెళ్తూ రోడ్డుపక్కన పడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతోపాటు అతను మద్యం సేవించి ఉండటం వల్ల త్వరగా చనిపోయినట్లు ఐజీ ఆశోక్ కుమార్ స్పష్టం చేశారు.

ఇంటినుంచి బయలుదేరిన ప్రవీణ్ డైరెక్టుగా ఎవరినీ కలవలేదని తెలిపారు. రెండు వారాలు సమయం ఇచ్చినా ఎవరు ఆధారాలతో రాలేదన్నారు. మొత్తం 92 మందిని ఇన్విస్టిగేషన్ చేశామన్నారు. ఇక ఈ ఇష్యూ ఇంతటితో ముగిసిందని, ఎవరు అనవసర వివాదాలు చేయొద్దని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవీన్ కుటుంబానికి ప్రైవసీ అవసరమని, దయచేసి ఎవరు దీనిని పక్కదారి పట్టించొద్దని కోరారు.

Also read



Related posts

Share via