SGSTV NEWS online
Andhra PradeshCrime

తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు

Police Constable murder : మంగళగిరిలో ఓ కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మంగళగిరిలోని గిద్దలూరు సమీపంలోని పచ్చర్లలో చోటుచేసుకుంది. తిరుపతి ఆక్టోపస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌.. గిద్దలూరు సమీపంలోని ఘాట్‌లో అనుమానాస్పద మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెబ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓ యువతితో ఫరూక్ కు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్‌ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఫరూక్ మృతి ప్రేమ వ్యవహారమా? లేకా ఇంకేమైన ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఫరూక్ సొంత ఊరైన ఆళ్లగడ్డ కు రావడానికి మూడు రోజులక సెలవుతీసుకున్నట్లు తెలిసింది. సెలవులు ముగిసిన డ్యూటీకి రాకపోవడంతో ఆరా తీసిన పోలీస్ డిపర్ట్ మెంట్ కు సంచలన విషయాలు తెలిశాయి. లీవు ముగిసిన తర్వాత అటు ఇంటికి పోకుండా, ఇటు డ్యూటీకి రాకుండా ఎటు పోయాడని ఆరా తీయడంతో ఫరూక్ పచ్చర్లలో దారుణ హత్యకు గురైనట్టు తెలిసింది. ఫరూక్ మృతదేహన్ని నాలుగు రోజుల క్రితమే ఒక కవర్ లో చుట్టి ఒక కల్వర్టులో పడవేసినట్లు గుర్తించారు. హత్యకు వివాహేతర సబంధమే కారణమనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Also read

Related posts