SGSTV NEWS online
Astrology

April 2026 Horoscope: ఏప్రిల్ మాసంలో ఆర్థికంగా వారికి జాక్‌పాట్.. మీ రాశికి ఎలా ఉందంటే..?



ఏప్రిల్ మాస ఫలాలు (April 2026 Horoscope): మేష రాశి వారికి ఈ నెల ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అయితే, ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీరిచ్చే సలహాలు బాగా పనికి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏప్రిల్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?






రవి, గురు, శుక్ర గ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు, ముఖ్యంగా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఇతరత్రా కూడా ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. పని భారం వల్ల విశ్రాంతి తగ్గే సూచనలున్నాయి. ఇంటి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

ధన స్థానంలో గురు సంచారం, లాభ స్థానంలో శనీశ్వరుడు, కుజుడి సంచారం వంటి కారణాల వల్ల ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అయితే, ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.






గురు, శుక్ర, రవి, కుజ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీరిచ్చే సలహాలు బాగా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.






రవి, కుజ, శుక్రుల అనుకూల సంచారం వల్ల నెలంతా బాగా అనుకూలంగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది.






రాశ్యధిపతి రవి, శుక్ర, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ముఖ్యమైన కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఆశించిన శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.






బుధ, గురు, రవుల అనుకూలత వల్ల సప్తమ శని ప్రభావం చాలావరకు తగ్గుతుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశముంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది.





ఈ నెలంతా గురు, శుక్ర, కుజ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులకు నచ్చిన తీరులో వ్యవహరించి వారిని బాగా ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యంగా భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు.




ఏప్రిల్ ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంటుంది. రాశ్యధిపతి కుజుడు, రవి, శుక్రుడు అనుకూలంగా మారుతున్నందువల్ల ఏప్రిల్ 15 నుంచి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్య మైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగి పోతాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.






గురు, రవి, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాలు తగ్గి, లాభాల బాటపడతాయి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగాసాగిపోతాయి.






ధన స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి  బయటపడ తారు. నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.





రాశ్యధిపతి శని ధన స్థానంలో, ధనాధిపతి గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం, రవి కూడా తృతీయ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. నాయకత్వ స్థాయి లభిస్తుంది. బుధుడు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలుంటాయి.






ధన స్థానంలో శుక్ర, రవులు, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువు అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది.  నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందివచ్చే అవకాశముంది.  ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలను సొంత ఆలోచనలతో నిర్వహించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.  ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also Read

Related posts