December 20, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Pawan Kalyan: హీరోల మోజులో పడకండి… ఫ్యాన్స్‌కు మరోసారి క్లాస్ పీకిన పవన్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరుకు ఉన్నక్రేజ్, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  సినిమాల విషయం పక్కన పెడితే..  ప్రస్తుతం పవన్ కేవలం హీరో మత్రమే కాదు.. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి. పదేళ్లు కష్టపడి  ఈ ఏడాది ఆయన తాను అనుకున్న విజయాన్ని అందుకున్నారు.



ప్రజలకు మంచి చేయడం కోసమే  రాజకీయాల్లోకి వచ్చానని మొదటి నుంచి చెప్తున్నా పవన్..  ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని చేస్తూ ఎంతోమంది ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం పవన్ ను అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు.. అభిమానులు  ఎప్పటికప్పుడు ఇబ్బందిని క్రియేట్ చేస్తూనే ఉన్నారు

పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా.. ఏ ఈవెంట్ కు వెళ్లినా.. అసలు ఆయన ఎందుకు వచ్చారు అనేది లేకుండా.. OG.. OG.. OG అంటూ అరవడం మొదలుపెట్టేస్తున్నారు.  ఈ విషయంలో  పవన్ ఎన్నోసార్లు అభిమానులకు వార్నింగ్ ఇస్తూనే వస్తున్నారు. అయినా కూడా ఫ్యాన్స్ లో కొద్దిగా కూడా మార్పు రాలేదు.

తాజాగా పవన్ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో పర్యటించారు. గతంలో ఆయన ఈ జిల్లాలో పర్యటించి అక్కడివారి పరిస్థితిని తెలుసుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు లేదని, అనారోగ్యం పాలైన వారు, గర్భిణులు, ముసలి వాళ్లను ఆస్పత్రులకు తరలించాలంటే ఈ ప్రాంతాల్లో డోలీ మోతలే అని, దీని వలన ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.  కచ్చితంగా వారికి న్యాయం చేస్తానని అప్పుడే మాట ఇచ్చారు.

ఇక డీసీఎం అయ్యాకా మాట  మార్చకుండా.. బాగుజోలలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలినడకన వెళ్లి మరీ రోడ్డు నిర్మాణానానికి శంకుస్థాపన చేశారు. అయితే ఇక్కడకు వచ్చిన  ఫ్యాన్స్ .. పవన్ ఏం చేస్తున్నారు.. ? అనేది కూడా లేకుండా  ఇక్కడ కూడా సినిమా గురించి చెప్పాలని ఒత్తిడి చేశారు. దీంతో మరోసారి పవన్  ఫైర్ అయ్యారు.

“నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు.. నేను మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు” అని సీరియస్ అయ్యారు.



ఇలా పవన్ తో క్లాస్ పీకించుకోవడం ఫ్యాన్స్ కు కొత్తేమి కాదు. ఇప్పటికి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు పవన్ చాలా పద్దతిగా ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. సినిమాలు కేవలం వినోదం మాత్రమే. బతకడానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఏదో ఒక పని ఉండాలి కదా .. ముందు దాని మీద ఫోకస్ చేయండి అంటూ ఎన్నోసార్లు చెప్పారు. అయినా పవన్ ఫ్యాన్స్ లో మార్పు రాలేదు.

ఇక పవన్ ఎన్నిసార్లు ఇలా చెప్తారు.. ? ఆయన  సినిమాలు కూడా చేస్తున్నారు కదా.. ? ఆ సినిమా ఈవెంట్స్ కు వచ్చినప్పుడు ఇలా అరవండి.. ప్రజాసేవలో ఉన్నప్పుడు ఇంత అతి ఎందుకు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

Also Read

Related posts

Share via