అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది. కోదాడ, ఏలూరు మధ్యలోని ఓ వైన్ షాప్‌లో ఆయన మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడిపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రమాదానికి ముందే ఆయన బైక్ హెడ్ లైట్ పగిలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసుకు సంబంధించి మరో మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని ఏలూరుల ఐజీ అశోక్ కుమార్ చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీఎం, డీజీపీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
Also read
- అపార్ట్మెంట్ పైనుంచి బిడ్డను కిందకు తోసేసిన కన్న తల్లీ
- వివాహేతర సంబంధం.. అత్తపై కోడలు దాడి
- Dhanurmasam: ధనుర్మాసం 2025.. లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే ఈ పనులు అస్సలు చేయకండి..
- Garuda Puranam: గరుడ పురాణంలోని మరణ రహస్యం..! మనిషి చనిపోయిన 13 రోజుల వరకు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా..?
- నేటి జాతకములు…18 డిసెంబర్, 2025





