SGSTV NEWS
CrimeTelangana

Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ


పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్దమనుషుల పంచాయితీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్దమనుషుల పంచాయితీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి. ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మల్లేశ్‌, గణేష్‌ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందని యువకుడి వర్గం ఆరోపిస్తోంది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

వివరాల ప్రకారం దంపతుల వివాదం పరిష్కారానికి.. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. దీనికోసం పెద్దపల్లి జిల్లా, మండలం రాఘవపూర్‌ గ్రామానికి చెందిన అమ్మాయి తరుపువారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరుపువారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశమయ్యారు.– పంచాయతీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.


చర్చల మధ్య మాటల దాడి తీవ్రతకు చేరగా, ఒక్కసారిగా అమ్మాయి బంధువులు కత్తులతో అబ్బాయి పక్షాలపై విరుచుకుపడ్డారు. దీంతో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో మల్లేష్,గణేష్‌తో పాటు మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. తీవ్రరక్తస్రావంతో స్పాట్‌లోనే మల్లేష్,గణేష్ అనే యువకులు చనిపోయారు. అమ్మాయి వర్గం సుపారీ గ్యాంగ్‌తో దాడి చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనలో మోటం మధునయ్యకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మోటం సారయ్య తలకు గాయాలవడం సహా మరికొందరు గాయపడ్డారు.గాయపడిన వారిని అత్యవసరంగా సుల్తానాబాద్‌ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో సుగ్లాంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.

Also read

Related posts