పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని జీవీ హర్షకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఇందుకు సంబంధించి హర్షకుమార్ సాక్ష్యాన్ని నమోదు చేయనున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు దర్యాప్తు అధికారికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, రాజానగరం పోలీస్ట్ స్టేషన్ పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. ఈ నోటీసులను జీవీ హర్షకుమార్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ నోటీసులు నిజాన్ని దాయగలవా? హర్షకుమార్ ను ఆపగలవా? అంటూ పోస్ట్ చేశారు
ముమ్మాటికీ హత్యే: హర్ష కుమార్ ఆరోపణలు
ఇదిలా ఉంటే.. ప్రవీణ్ మృతిపై మాజీఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ముమ్మాటికీ ఇది హత్యేనన్నారు. ప్రవీణ్‌ది హత్య అనడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయన్నారు. హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదులు లేదా క్రైస్తవ మతోన్మాదులు ఈ హత్యకు కారణం కావొచ్చన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్లే కేసుపై అనుమానాలు రేకెత్తాయన్నారు.
పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కేసు విచారణ సక్రమంగా జరగకపోతే.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లి రీ ఇన్వెస్టిగేషన్ జరిగేలా చూస్తానన్నారు. నిన్న తాము సంయమనం పాటించడం వల్లే పోలీసులు మృతదేహాన్ని హైదరాబాద్ తరలించగలిగారన్నారు.
Also read
- కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..
- Vizianagaram: ప్రశాంత జిల్లాను కలవరపాటుకు గురిచేసిన సిరాజ్ నేపద్యం ఏంటి?
- Palndau District: పల్నాడులో ప్రాణాలు తీసిన ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
- హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా? డీజీపీ స్టేట్మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
- Hyderabad: పండుటాకులకు పెళ్లి సంబంధాలు చూస్తామని.. పళ్లాలు బోర్లించారు