SGSTV NEWS
Andhra PradeshCrime

Palnadu: నరసరావుపేటలో దారుణం.. పిల్లలకు గంజాయి ఇచ్చి చోరీలు చేయిస్తున్న ముఠా

పల్నాడు జిల్లా నరసరావుపేటలో పిల్లలకు గంజాయి ఇచ్చి చోరీలు చేయిస్తున్న ముఠా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో పిల్లలకు గంజాయి ఇచ్చి చోరీలు చేయిస్తున్న ముఠా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఠా నుంచి రక్షించాలంటూ బాధిత కుటుంబం శనివారం పోలీసులను ఆశ్రయించింది.

నరసరావుపేట పట్టణంలోని వరవకట్టకు చెందిన షారుక్, ఫరూక్.. మైనర్లను డ్రగ్స్, గంజాయికి బానిసలు చేసి వారితో సెల్ఫోన్ దొంగతనాలు, గంజాయి రవాణా చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు రెండు నెలల క్రితం పోలీసులకు పట్టుబడి జువైనల్ హోంలో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. బాలుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయాలంటూ షారుక్, ఫరూక్ వేధిస్తున్నారు. దీంతో వారి వేధింపులు తాళలేక బాలుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. అమయాకులైన చిన్న పిల్లలను టార్గెట్ చేసి చట్ట విరుద్ధమైన పనులు చేయిస్తున్న వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Also read

Related posts