హైదరాబాద్: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న అత్తాపూర్ పోలీసుల పైకి నెంబర్ ప్లేట్ లేని కారులో దూసుకువచ్చిన యువకుడిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. న్యాయమూర్తి యువకుడికి జ్యూడిషియల్ రిమాండ్కు తరలించారు.
ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపిన మేరకు.. గురువారం అర్ధరాత్రి పిల్లర్ నంబర్ 133 వద్ద అత్తాపూర్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు ‘ఘోస్ట్’ అని ఆంగ్లంలో రాసి ఉన్న నెంబర్ ప్లేట్ లేని కారులో వేగంగా దూసుకువచ్చి పోలీసులను చూసి అదే వేగంతో వెనక్కు వెళ్లాడు. పోలీసులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా మరింత వేగంతో ముందుకు దూసుకువచ్చాడు.
మితిమీరిన వేగంతో ఉండడంతో పోలీసులు అప్రమత్తమై పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. నెంబర్ ప్లేటుపై గోస్ట్ అని రాసి ఉంది. శుక్రవారం సీసీ కెమెరాలు జల్లెడ పట్టి చివరకు టోలిచౌకి సాలార్జంగ్ కాలనీకి చెందిన మహమ్మద్ ఫయాద్ఉద్దీన్(20)గా గుర్తించారు. సుజుకి ఫ్రాంక్స్ కారును, నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
Also read
- నెంబర్ ప్లేట్ స్థానంలో ‘ఘోస్ట్’ కారుతో పోలీసులపైకే!
- మూత్రం పోస్తుందని మూడేళ్ల కూతురిని కడతేర్చిన తల్లి!
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సూటి ప్రశ్న..?!*
- Dussehra: దసరా రోజున ఈ పనులు అస్సలు చేయకూడదట! దశమి నాడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలివే!
- రావణ సంహారానికి ముందు శ్రీరాముడు ఈ దేవతను ఎందుకు పూజించాడు? దసరా వెనుక ఉన్న పురాణ గాథ ఇదే!





