తిరుమల శ్రీవారి ఆలయం ముందు అక్టోపస్ మాక్ డ్రిల్ భక్తులను కలవరపాటుకు గురి చేసింది. ఉగ్రవాదుల ముప్పు ఉన్న ఆలయం పై దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహించిన ఆక్టోపస్ ఎన్ ఎస్ జి బలగాల హడావుడి భక్తులను అయోమయానికి గురిచేసింది. అర్ధరాత్రి శ్రీవారికి ఏకాంత సేవ పూర్తయ్యాక భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు ఆలయంలోకి ప్రవేశిస్తే భక్తులను ఎలా రక్షించాలి, ఆలయ తలుపులు మూసివేస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మాక్ డ్రిల్ చేసింది. లైట్లు ఆఫ్ చేసి లిఫ్ట్ ద్వారా మహద్వారం వద్ద భద్రత సిబ్బంది ఆలయంలోకి ప్రవేశించి మాక్ డ్రిల్ చేపట్టాయి భద్రతా బలగాలు.

దాదాపు 180 ఆయుధాలతో అరగంట పాటు మాక్ డ్రిల్ నిర్వహించడంతో కొంతసేపు భక్తుల్లో అసలేమీ జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నంలో ఆందోళనకు లోనయ్యారు. ఆలయంలో ఎవరైనా ఉన్నారా అని బిత్తర పోయారు. అయితే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా రొటీన్ గా జరిగే ప్రక్రియ అని తెలుసుకొని ఊపిరి తీసుకున్నారు. అయితే తిరుమల శ్రీవారి ఆలయం ముందు సాయుధబలగాల పర్ఫార్మెన్స్ చూసిన భక్తులు భద్రత విషయంలో టిటిడి, ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉందని తెలుసుకున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025