April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshPolitical

నిడదవోలు: టీడీపీ అధ్యక్ష పదవికి కె వి ఆర్ రాజీనామా…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులుగా పనిచేస్తున్న కొమ్మిన వెంకటేశ్వరరావు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఈయన పార్టీ కష్ట కాలంలో స్థానిక సంస్థ ఎన్నికలు నిడదవోలు పట్టణ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలబడి మున్సిపల్ ఎలక్షన్ విజయవంతంగా వైసిపి పార్టీని ఎదుర్కొని పోటీ చేయడం జరిగింది . ఐదు సంవత్సరములు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రతి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అన్నిటిని కూడా విజయవంతంగా నిర్వహించి పార్టీ ఉనికిని కాపాడిన కొమ్మిన వెంకటేశ్వరరావు  అధికారం వచ్చిన తర్వాత రిజైన్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది వారు రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా నిడదవోలు నియోజకవర్గం సీనియర్   కార్యకర్తలు అభ్యర్థిస్తున్నా   అన్నారు



* నిడదవోలు పట్టణ టిడిపి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొమ్మిన వెంకటేశ్వరరావు

* వరుసగా మూడు పర్యాయాలు పట్టణ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక

* నిడదవోలు లో అధికార పార్టీ నాయకులు తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆవేదన

* తనకు గాని ,నిడదవోలు నియోజకవర్గం తెదేపా పార్టీ ఇంచార్జ్ శేషరావుకు గానీ, పార్టీ కార్యకర్తలకు గానీ కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఆరోపణ

* పార్టీ కార్యకర్తగా కొనసాగుతాను అన్న కొమ్మిన వెంకటేశ్వరరావు.

* తెలుగుదేశం పార్టీ తమ నాయకుడికి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్

* పరిస్థితి ఇలానే ఉంటే రాజీనామాల బాటలో మరి కొంతమంది తెలుగు తమ్ముళ్లు.

Also read

Related posts

Share via