*నిడదవోలు* నియోజకవర్గ స్థాయి *తెలుగుదేశం* పార్టీ మినీ *”మహానాడు”* *ఉండ్రాజవరం* మండలం *వేలివెన్ను* గ్రామం లో రైతు సంఘ భవనం నందు *నిడదవోలు* నియోజకవర్గం *తెలుగుదేశం* పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇంఛార్జి *శ్రీ బూరుగుపల్లి శేషారావు* గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఉదయం నుంచి భారీ వర్షం పడిన పెద్దఎత్తున *తెలుగుదేశం* నాయకులు కార్యకర్తలు విచ్చేసి జయప్రదం చేశారు.
ఈ మినీ *”మహానాడు”* లో మొదటిగా *తెలుగుదేశం* పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీ”శే *శ్రీ నందమూరి తారక రామారావు* గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన *శ్రీ బూరుగుపల్లి శేషారావు* గారు మరియు నాయకులు,కార్యకర్తలు.
కార్యక్రమం లో *నిడదవోలు* నియోజకవర్గ *తెలుగుదేశం* పార్టీ కుటుంబ సభ్యులు ఆమోదించిన 4 తీర్మానాలు
1. *”ఆపరేషన్ సిందూరు”* కి సహకరిస్తూ అక్కడ పోరాడుతున్న సైనికులకు అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు *నరేంద్ర మోది* గారికి సంఘీభావంగా మొదటి తీర్మానం ఆమోదించారు.
2. *తెలుగుదేశం* పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు *శ్రీ నందమూరి తారక రామారావు* గారికి *”భారత రత్న”* ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రెండవ తీర్మానం ఆమోదించడం జరిగింది.
3. మన *నిడదవోలు* నియోజకవర్గం *తెలుగుదేశం* పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇంఛార్జి *శ్రీ బూరుగుపల్లి శేషారావు* గారికి *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్* గా నియమించిన సందర్భంగా *రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు* గారికి మరియు *తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు* గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మూడవ తీర్మానం ఆమోదించడం జరిగింది.
4. గత రెండు సంవత్సరాల నుంచి *నిడదవోలు* నియోజకవర్గం లో మరణించిన నాయకులు కార్యకర్తలకు సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలియజేస్తూ నాలుగో తీర్మానం చేయడం జరిగింది.
*ఈ సందర్భంగా శేషారావు గారు మాట్లాడుతూ “మహానాడు” తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు ప్రజలందరి పండగన్నారు.అన్న నందమూరి తారక రామారావు గారు బ్రహ్మ ముహూర్తం లో పార్టీ స్థాపించారని అందుకే నేటికీ చెక్కు చెదరకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని అన్నారు….ఎన్టీఆర్ తెలుగు వాడి కీర్తి ప్రతిష్టలు చాటి చెపితే, రెండవ తరంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాడి సత్తాను ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. ఇటీవల రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, యువనేత నారా లోకేష్ బాబుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణంలో, పార్టీ గెలుపులో, వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.నిడదవోలు నియోజకవర్గంలో తనకు అండదండగా నిలబడిన నియోజకవర్గ ప్రజానీకానికి సదా ఋణపడి ఉంటానన్నారు. పార్టీ అప్పగించే బాధ్యత ఏదైనా సరే ఒక నాయకుడిగా కాకుండా ప్రజల్లో ఒకడిగా వాటిని నెరవేరుస్తానన్నారు. అభిమానులు చూపించిన ఆదరణ చూసి ఆయన ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు.ఎంత ఎదిగినా, పదవులు ఉన్నా లేకపోయినా తాను ప్రజల నుండే వచ్చానని ప్రజల తోనే ఉంటానన్నారు. అన్నివేళలా తనకు జన్మనిచ్చిన వేలివెన్ను గ్రామానికి, రాజకీయ భవిష్యత్తును ఇచ్చిననిడదవోలునియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ ఒక సేవకుడిగానే సేవలందిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దాసరి సత్యనారయణ గారు, మరియు మండల,పట్టణ,గ్రామ అధ్యక్షులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025