SGSTV NEWS online
CrimeTelangana

నవ వధువు ఆత్మహత్య.. ఏం జరిగింది?



మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్ తో మార్చి 5న వివా హం జరిగింది. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమె, శుక్రవారం రాత్రి అత్తారింటికి చేరుకుంది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా, పెళ్లైన నెల రోజులకే అఖిల బలవన్మరణానికి పాల్పడటం కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

Also read

Related posts