ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి, తన సోదరి ఖాతాలోని రూ. 19,300ను రాబట్టుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు.
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి, తన సోదరి ఖాతాలోని రూ.19,300ను రాబట్టుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు. అందుకోసం సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
కియోంఝర్‌లోని దియానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి సోదరి కాక్రాకు మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండేది. కాక్రా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం అంతకు ముందే మరణించారు. దీంతో కాక్రాకు కుటుంబ సభ్యుడిగా జితు మాత్రమే ఉన్నాడు. దీంతో తన సోదరి ఖాతాలో మిగిలిన రూ.19,300 విత్‌డ్రా చేసుకోవడానికి జితు బ్యాంకును సంప్రదించాడు. అయితే డబ్బు తీసుకోవాలంటే ఖాతాదారుడు తప్పనిసరిగా హాజరు కావాలని, లేదా మరణ ధ్రువీకరణ పత్రం గానీ, వారసత్వ పత్రాలు గానీ సమర్పించాలని చెప్పి, డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు
చదువు లేని గిరిజనుడైన జితు వద్ద అలాంటి పత్రాలు లేవు దీంతో సోమవారం నాడు శ్మశానవాటికకు వెళ్లిన జితు తన సోదరి అవశేషాలను బయటకు తీశాడు. అస్థిపంజరాన్ని గుడ్డలో చుట్టి బ్యాంకుకు తీసుకెళ్లాడు. జితు చేతిలోని అస్థిపంజరాన్ని చూసిన బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ శాంతపరిచారు. డబ్బు జితుకు చేరేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చ చెప్పారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





