July 2, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Latest News

ముఖ్యమంత్రి ఎన్నికల అనంతరం శంకరమన్యం పట్టడం ఖాయం నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ



ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల అంతిమ విజయం మాదే
మాజీ మంత్రి పితాని


పెనుగొండ:- సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎవరితో పెట్టుకోకూడదు వారితోనే పెట్టుకున్నాడు ఎన్నికల తర్వాత శంకరమన్యం పట్టడం ఖాయమని నరసాపురం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం ఉదయం పెనుగొండ మండలం సిద్ధాంతంలోని రేవతి ఫంక్షన్ హాల్ లో బిజెపి టిడిపి జనసేన ఆచంట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆచంట అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఐదేళ్లలో రాష్ట్రంలో అక్రమ కేసులు అరాచక పాలన విధ్వంశాలు జగన్ రెడ్డి పాల్పడ్డారని ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు త్రిశూల వ్యూహంతో జనసేన బిజెపి టిడిపి టిడిపి ఉమ్మడి కూటమి ఎన్నికల బరిలో అవినీతి పాలకుడైన జగన్ మోహన్ రెడ్డిని త్రిశూలం తో వధించి శ్రీరామ రాజ్యాన్ని ప్రజలకు అందించాలన్నదే లక్ష్యం అని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డబల్ ఇంజన్ సర్కార్ను అభివృద్ధి సంక్షేమం పెద్దపీట వేస్తారని అన్నారు. ఐదేళ్లగా స్థానిక ప్రజా ప్రతినిధి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు, అక్రమ కేసులతో భయభ్రాంతులను చేస్తూ పాలన సాగించాడని జనసేన టిడిపి బిజెపి నాయకులను ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఇక్కడ నాయకుడు నీ నియోజకవర్గానికి రాకముందే నాతో పంచాయతీ ఉందని అన్నారు డిఎన్ఆర్ పాలకవర్గ ఎన్నికల్లో ఆయన ప్యానెల్ ను చిత్తుచిత్తుగా ఓడించానన్నారు. నాపై పరువు నష్టం కేసు పెట్టారని మా కుల పెద్దలతో బెదిరించి హెచ్చరించారని చూస్తానని అన్నాడు ఏం పీకలేకపోయాడంటూ శ్రీనివాస్ వర్మ విమర్శించారు ఇక్కడ ఉన్న పితాని సత్యనారాయణ నేను ఫీల్డ్ స్థాయి నుండి వచ్చిన కార్యకర్తలమని డబ్బు ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చేశారు. తాత ముత్తాతల వారసత్వ రాజకీయాలు జెండా మోసిన సామాన్య కార్యకర్త దగ్గర నుండి వచ్చామని గుర్తు చేశారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధికి తగిన బుద్ధి చెబుతామని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని జూన్ 4 తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఓటమి అభ్యర్థుల విజయం సత్యమని 18 రోజుల కష్టపడి ముందుకు వెళ్లాలని లక్ష్యం కోసం పనిచేయాలని కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని చేకూర్చాలని శ్రీనివాస వర్మ మూడు పార్టీల నేతలకు కోరారు. పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోనూ ఆచంటలోనూ అవినీతి అరాచక పాలన సాగిందని ఇక్కడ స్థానిక నాయకులు ఇప్పటికీ ఆ ప్రజాప్రతిని కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు అక్కడక్కడ ప్రజాప్రతినిధికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని పోలీసులను సైతం లెక్కచేసే పరిస్థితి లేదని జనసేన బిజెపి టిడిపి టిడిపి నాయకులు ఇక్కడ ప్రజాప్రతినిధి వైసీపీ నేతలు ప్రజలను కార్యకర్తలను భయ పెడుతున్నారని ఇసుక డబ్బు ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా సొమ్మును సొంత గజా నాకు మళ్ళించారని ఈ ఎన్నికల్లో ఆ సొమ్మును ఖర్చు చేసేందుకు వైసీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారని ఓటుకు 3000 కాదు 5000 10,000 ఇచ్చి చూడాలి పితాని సత్యనారాయణ అన్నారు. ఇన్ని డబ్బులు ఇచ్చిన అంతే మీ విజయం కోట ముందేనని చెప్పారు రైతుల నుండి డ్యూటీ చేసిన సొమ్ము రైస్ మిల్లర్ల సొమ్ము భారతీయ విద్యా భవన్ నిధులు మైనింగ్ డబ్బులు ఉన్నాయని ఎంత ఇచ్చిన అంతిమంగా ఓటమి గెలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ బిజెపి పరిశీలకులు కే శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జవహర్ ఆచంట నియోజకవర్గం పరిశీలకులు రుద్రరాజు వెంకటరామరాజు, ఆచంట నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కే హెచ్ వి ప్రసాద్ రెడ్డి. జనసేన నాయకులు బిజెపి టిడిపి నియోజవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via