నంద్యాల జిల్లా ఆత్మకూరలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో పెళ్లనగా వరుడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తుండగా .. అతడి బైక్ ని బొలెరో వాహనం ఢీకొట్టింది
మరో పదిరోజుల్లో పెళ్లనగా.. పెళ్ళికొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పారాణితో చూడాల్సిన కొడుకును ప్రాణం లేకుండా చూసిన ఆ కన్నతల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. పెళ్లి భాజాలతో కళకళలాడుతూ ఉండాల్సిన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ విషాదకరమైన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణం ఏకలవ్య నగర్ లో చోటుచేసుకుంది
పెళ్లి పత్రికలూ ఇవ్వడానికి వెళ్ళి..
అయితే ఆత్మకూరు కి చెందిన నాగేంద్ర అనే యువకుడు ఈ నెల 30న తన పెళ్లి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇస్తూ వస్తున్నాడు. అలా వరుడు నాగేంద్ర లింగాల గ్రామంలోని తన బంధువులకు పత్రిక ఇచ్చేందుకు వెళ్ళాడు. పత్రిక ఇచ్చిన తర్వాత తిరిగి ఆత్మకూర్ కి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగేంద్ర వెళ్తున్న బైక్ ని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు నాగేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకొని.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన కొడుకు.. ఇక లేడని తెలియడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. అతడి కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!