April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, పది మందికి తీవ్ర గాయాలు


నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృత దేహాలను వెలికితీశారు.



నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృత దేహాలను వెలికితీశారు.  ఈ ఘటనలో  దినేష్(10),సుబ్బమ్మ(60) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా రాత్రి నుంచే గ్యాస్ లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు. తెల్లవారి జామున వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది.  రాత్రి పూట ఇంట్లో గ్యాస్ సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్  ఇల్లంతా వ్యాపించింది. ఈ తెల్లవారుజామున సుబ్బమ్మ లైట్ వేయడంతో ఒకసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. భారీగా శబ్ధం చేస్తూ రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో సుబ్బమ్మతో పాటు దినేష్ (పండు) అక్కడక్కడే మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది కూలిన ఇంటి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నాయనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో.. గ్రామస్తులు భయంతో వణికిపోయారు. కాగా ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Also read



Related posts

Share via