సోంపేట, : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ కోటిలింగేశ్వర ఆలయ ఆవరణలోని ఉమామహేశ్వర దేవాలయానికి చెందిన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. మొదట ఆలయంలోని విగ్రహాన్ని ఎత్తుకెళ్లి, సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట పొలాల్లో ధ్వంసం చేసి వదిలేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసు అధికారులతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయంతో పాటు విగ్రహాన్ని పగలగొట్టిన పొలం, ఇతర ప్రదేశాలను పరిశీలించాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలు దొరుకుతాయన్న ఆశతో ఈ చర్యకు పాల్పడ్డారా.. లేక వేరే కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడికి ఎదురుగా చిన్న గదిలో అమర్చిన ఆ విగ్రహాన్ని దుండగులు తొలగించారు. గునపంతో ఓ చోట రంధ్రం చేసి పెకిలించిన ఆనవాళ్లున్నాయి.
Also read
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!
- AP News: ‘నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా’.. కేటుగాళ్ల కొత్త రకం మోసాలు
- బారువలో నంది విగ్రహం ధ్వంసం
- Rajahmundry:కల్తీ పాలు కేసులో మరో మృతి… మృతుల సంఖ్య 17కి పెరుగుదల.
- మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి





