అల్లూరి సీతారామరాజు జిల్లా: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు-హుకుంపేట ప్రధాన రహదారిలో పాటిమామిడి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై పాడేరు నుంచి వస్తు డివైడర్ను ఢీకొని పాడి శ్రీకాంత్(28) సంఘటన స్థలంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో డివైడర్ను ఢీకొనగా వాహనం అతనిపై పడినట్టు పేర్కొన్నారు. దీనిపై మృతుడు తండ్రి పాడి చంటిబాబు తన కుమారుడు ప్రమాదంలో మృతి చెంది ఉండరని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేపట్టి యువకుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025