SGSTV NEWS
Andhra PradeshCrime

YSRCP ZPTC Murder: వైసీపీ జడ్పీటీసీ నూకరాజు దారుణహత్య, అల్లూరి జిల్లాలో ఘటన

కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొయ్యూరు మండలం వైసీపీ నేత, జడ్పిటిసి వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు. భూమి విషయమై జరిగిన గొడవలో గిరిజనులు ఆయనను దారుణంగా హతమార్చారు. గిరిజనులు భూమి కోసం జడ్పీటీసీని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పట్టా భూమి విషయంలో గిరిజనులతో వివాదం


రోలుగుంట మండలం చటర్జీ పురం వద్ద YSRCP ZPTC నూకరాజుకు పది ఎకరాల పొలం ఉంది. ఆ భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరిట ఉంది. అయితే ఆ భూమిని కొన్నేళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈ భూమి విషయంలో గిరిజనులకు, ఆయనకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో గిరిజనులు ఒకసారి ఆయన మీద దాడి చేశారు. గాయపడిన నూకరాజు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజులపాటు చికిత్స పొందిన తరవాత కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల సమయంలో పోలీసులు బైండోవర్ కేసులు కూడా నమోదు చేశారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం వైసీపీ జడ్పిటిసి నూకరాజు తన భూముల దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా భూమి సాగు చేస్తున్న గిరిజనులకు, వైసీపీ నేత నూకరాజుకు మధ్య వాగ్వాదం మొదలైంది. మాట మాట పెరగడంతో గిరిజనులు దాడిచేసి జడ్పీటీసీ నూకరాజును హత్య చేశారు. సమాచారం అందుకున్న రోలుగుంటం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నూకరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts