SGSTV NEWS online
CrimeSri Ganesha PuranamTelangana

Suryapet: టీవీ విషయంలో గొడవ.. కన్న కూతురిని తల్లి ఏంచేసిందో తెలిస్తే షాక్..





Mother kills daughter in suryapet: టీవీ విషయంలో తల్లికి, కూతురికి మధ్య వాగ్వాదం జరిగింది.అది కాస్త పీక్స్ కు చేరింది. సూర్యపేట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

ఇటీవల సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా మంట గలిసాయని చెప్పుకొవచ్చు. కన్నవాళ్లేనే వారి సొంత పిల్లలు చంపేస్తున్నారు.  మరికొన్ని చోట్ల ఆస్తిపాస్తుల కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు తమ కూతురిపై దారుణాలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపర అంశాలు, వివాహేతర అంశాల్లో పడి సమాజంలో కొంత మంది ఉన్మాదుల్లా మారుతున్నారు. 

సమాజంలో తల్లిని మించిన దైవం లేదని చెప్తారు. అలాంటి ఒక కన్న తల్లి తన కూతురిపై దాడి చేసి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమైంది. సూర్యాపేట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

సూర్యాపేట జిల్లా కోదాడ చర్చి బజార్‌లో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రిపూట టీవీ చూసే విషయంలో తల్లి సైరాబాను, 8 ఏళ్ల కూతురు జాస్మిన్ లకు మధ్య గొడవజరిగింది. దీంతో కోపంలో తల్లి కూతురి తలపై రాయితో దాడి చేసి హతమార్చింది.

తీవ్రగాయాలపాలైన జాస్మిన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రిలో తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఈ క్రమంలో మేనమామ ఫిర్యాదుతో కోదాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

అయితే సైరా బాను కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధ పడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై స్థానికంగా కొంతమంది మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఈ ఘటన సూర్యాపేట్ లో తీవ్ర విషాదకరంగా మారింది.

Also read

Related posts