హైదరాబాద్: నల్గొండ జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లో కార్డ్వర్గా పనిచేసే అస్లాం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ మహిళ వద్ద గతంలో తీసుకున్న అప్పు చెల్లించకుండానే.. మరోసారి రుణం అడగడంతో ఆమె అవహేళన చేసిందనే కారణంతో కక్ష పెంచుకున్నాడు. కక్షకు తోడు ఆర్ధికావసరాల నేపథ్యంలో సదరు మహిళ ఇంట్లో దోపిడీకి పన్నాగం పన్నాడు. గత జూన్ 19న మహిళ ఇంటికి చేరుకున్నాడు. కత్తితో ఆమెను, ఆమె భర్తను. 20 ఏళ్ల వయసున్న కుమార్తెను పొడిచి చంపేశాడు. భయంతో మంచం కింద దాక్కున్న 12 ఏళ్ల బాలికనూ బయటకి లాగి మరీ ప్రాణం తీశాడు.
ఇంతటి కిరాతకానికి పాల్పడిన అతడికి గతంలో ఎలాంటి నేరచరిత్రా లేకపోవడం గమనార్హం..పది మందితో కలిసి ప్రణాళిక రచించాలి.. పక్కాగా అమలు చేసేలా సమయం కోసం వేచిచూడాలి.. ఇదీ ఒకప్పుడు కరడుగట్టిన నేరస్థులు అనుసరించిన పంథా. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. తరచూ నేరాలకు పాల్పడేవారి (రిపీటెడ్ అఫెండర్స్) స్థానంలో కొత్త నేరగాళ్ళు పుట్టుకొస్తున్నారు. నేరచరిత్ర లేని వారు కూడా.. అవసరాన్ని బట్టి నేరస్థులు అవతారమెత్తుతున్నారు. వ్యక్తిగత కక్షతో ప్రతీకారం తీర్చుకునేందుకు నేరమయ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆన్లైన్లో వీక్షించి క్షణాల్లో పథకం రూపొందించుకుంటున్నారు. యువత ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు నేరాల బాట పడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థికపరమైన అవసరాలను తీర్చుకునేందుకు, జల్సాలకు నేరాలను ఎంచుకుంటున్నట్లు పేర్కొంటున్నాయి.

కొత్త నేరస్థులు పుట్టుకొస్తున్నారిలా..
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అరెస్టయ్యే నిందితుల్లో 90 శాతానికి పైగా కొత్తవారే ఉండటం గమనార్హం. సాధారణంగా పాత నేరస్థుల కదలికల పై పోలీసులు. నిఘా ఉంటుంది. అయితే, కొత్త నేరస్థులు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు నేరానికి పాల్పడతారో పసిగట్టడం అసాధ్యం. దాదాపుగా ఈ తరహా నేరాలన్నీ వ్యక్తిగత కక్షలతోనే జరుగుతుంటాయి కాబట్టి నిఘా ఉంచడం కుదరదు కూడా. బాధితులు, నిందితులు అంతా పరిచయమున్న వారే కావడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
Also read
- Astrology: డిసెంబర్ కల్లా వీరు జీవితంలో వెలుగు ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
- విజయదశమి నాడే ఆయుధ పూజ ఎందుకు చేయాలి? వాహనాలు, పనిముట్ల పూజ ప్రాశస్త్యం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నేర ప్రపంచంలో కొత్త ముఖాలు!
- ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ.. కర్రలు, ఇనుప రాడ్లతో ఓ కుటుంబంపై దాడి





