కామాంధుల ఘాతుకం
మహిళపై లైంగిక దాడి
కూకట్‌పల్లి పరిధిలో ఘటన
హైదరాబాద్: కామాంధుల ఘాతుకానికి ఓ మహిళ బలి అయింది. లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని విష్ణుప్రియ లాడ్జి సమీపంలోని ఏఆర్ పైపు వర్‌ుక్స సెల్లార్‌లో ఓ మహిళ మృతదేహం ఉందనే సమాచారం అందటంతో కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు.
ఆదివారం తెల్లవారుజామున సుమారు 4.30– 5 గంటల మధ్య వైన్ షాపు వద్ద రోడ్డుపై ఓ మహిళ మూసాపేటకు వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆమెను ఒకరు చేతులు, మరొకరు కాళ్లు పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న ఏఆర్ పైపువర్కు సెల్లార్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి అదే బైక్‌పై కూకట్‌పల్లి వైపు వెళ్లినట్లుగా పోలీసులు సీసీ ఫుటేజీలో గమనించారు. అక్కడ ఉన్న సెల్లార్ చాలా లోతుగా ఉండటంతో రోడ్డుపై నుంచి చూసినా ఎవరికీ కనిపించదు.
ప్రాణాలు కోల్పోయిన మహిళ వయసు 42 నుంచి 48 ఏళ్ల మధ్య ఉంటుందని, తీవ్ర రక్తస్రావం కావటంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మూసాపేటలో ఎక్కువగా సంచరించే ఓ మహిళ.. విష్ణుప్రియ లాడ్జి సమీపంలోని బైక్ షోరూంలో 2019 నుంచి స్వీపర్‌గా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటలకు పని చేస్తోంది. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో పక్కనే ఉన్న వైన్‌షాపులో మద్యం తాగి రాత్రి వరకు అక్కడే ఉండి మూసాపేటలోని చిత్తారమ్మ ఆలయం పరిసర ప్రాంతంలో నిద్రించేదని స్థానికులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున కూడా రోడ్డుపై వెళుతుండగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు
Also read
- బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
- Hyderabad : మరో అమ్మాయితో లవర్ కి పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!
- Andhra: కియాలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో పురోగతి.. 9 మంది అరెస్ట్
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..