కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఓ జ్యోతిష్కుడు హల్ చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హడావిడి చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, “పాప భూదేవతలో ఉంది.. త్వరలో తిరిగి వస్తుంది” అంటూ చెప్పాడట. అదే సమయంలో.. కుటుంబ సభ్యులను భయపెట్టేలా, అలాగే ఆశ కలిగించేలా మాటలు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గత రెండు రోజులుగా అతను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి. “అమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉంది చెప్పు” అంటూ జ్యోతిష్యుడు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకోకుండా ఇలా భయపెట్టే మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.
మరోవైపు, యువతి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతిష్యుడి హావభావాలు, అతని నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక్కసారిగా జ్యోతిష్యుడి హడావిడితో కొత్త మలుపు తిరిగి, స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





