పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మూకలు మరోసారి రెచ్చిపోయారు.
కారంపూడి: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మూకలు మరోసారి రెచ్చిపోయారు. పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించిన ఆ పార్టీ శ్రేణులు ఇవాళ కూడా దాడుల పరంపరను కొనసాగించారు. మంగళవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేటసన్నెగండ్ల గ్రామానికి వెళ్తూ మధ్యలో కారంపూడిలో ఆగారు. ఈక్రమంలో ఒక్కసారిగా తెదేపా కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి, సమీపంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన తెదేపా నేత జానీబాషా వాహనానికి నిప్పు పెట్టారు. దాడులను ఆపేందుకు యత్నించిన కారంపూడి సీఐ నారాయణస్వామిపై కూడా దాడికి తెగబడ్డారు. పట్టణంలో తీవ్ర భయానక వాతావరణం సృష్టించారు. తెదేపా కార్యాలయానికి సమీపంలో ఉన్న చిరువ్యాపారి పున్నమ్మ తోపుడు బండిని సైతం వైకాపా మూకలు ధ్వంసంచేశాయి. మాచర్ల నుంచి వచ్చిన వారు తన ఉపాధిని ధ్వంసం చేశారని పున్నమ్మ కన్నీరు పెట్టుకుంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025