తిరుపతి: నగరంలోని కొర్లగుంటలో నివాసం ఉంటున్న ఓ బాలిక అదృశ్యమైంది. ఈస్ట్ సీఎస్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. కొర్లగుంట మారుతీనగర్ లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమార్తె ఆక్సా క్వీన్(14) సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.
దీంతో వెంటనే ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాప హైదరాబాద్ కి వెళ్లినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సెల్ ఫోన్ అధికంగా వినియోగిస్తూ.. వాటర్ డ్రైవర్ తో మాట్లాడినట్లుగా గుర్తించారు. బాలిక ఆచూకీ లభ్యమైతే 9440348671, 9440796748 సంప్రదించాలని సూచించారు.
మరో బాలిక..
ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Also read
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!





