July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

కుమార్తె చేసిన పనికి ఆ తల్లిదండ్రులు గుండె పగిలింది

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.


సమాజాంలో గొప్ప చదువులు చదువుకుంటే గొప్ప పొజీషన్లో ఉంటారని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలనే తపనతో విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. అయితే ఫలితాల్లో తాము అనుకున్న మార్కులు సాధించకున్నా.. ఫెయిల్ అయినా తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. కొన్నిసార్లు ఇన్విజిలేటర్లు చేసే తప్పిదాల వల్ల ఫస్ట్ క్లాస్ రావాల్సిన వారు ఫెయిల్ అయిపోతున్నారు. ఓ మెడికల్ విద్యార్థిని తాను అనుకున్న లక్ష్యం సాధించలేదని కృంగిపోయింది. డిప్రేషన్ లోకి వెళ్లిన యువతి ఎవరూ చేయని పని చేసింది. వివరాల్లోకి వెళితే..


హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫిజియోథెరపీ నాలుగో సంవత్సరం పరీక్షలో విజయం సాధించలేదనే బాధతో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో రైతు కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రైతు కాలనీకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బుచ్చయ్యకు ఇద్దరు కూతుళ్లు. భార్య ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. పెద్ద కూతురు కీర్తి (24) హైదరాబాద్ లో ఓ కాలేజ్ లో ఫిజియోథెరపీ నాలుగో సంవత్సరం చదువుతుంది. రెండో కూతురు ఢిల్లీలో ఓ కాలేజ్‌లో డిగ్రీ చేస్తుంది. ఇటీవల జరిగిన ఎగ్జామ్స్ కి సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి.

ఈ ఫలితాల్లో కీర్తి ఓ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యింది. తల్లిదండ్రులు తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచి చదివిస్తున్నారని.. వారి నమ్మకాన్ని కాపాడలేకపోయానని స్నేహితులతో చెప్పుకొని బాధపడింది. ఈ క్రమంలోనే తీవ్ర డిప్రేషన్ లోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పనినిమిత్తం బయటకు వెళ్లగా.. గురువారం రాత్రి తన బెడ్ రూమ్ లో ఫ్యాన్ కి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బుచ్చయ్య దంపతులు ఇంటికి చేరుకొని తలుపు తట్టగా ఎంతకు స్పందన రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా కీర్తి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే చనిపోయింది. చిన్న కారణంతోనే మనస్థాపానికి గురై అర్థాంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. వారి కన్నీరు చూసి కాలనీ వాసులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via