కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం(Illegal Affair) ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు. దీంతో ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో రాఘవేంద్ర ఆయుర్వేద కాలేజీ ఉంది. ఇందులో నిఖిత (22) అనే స్టూడెంట్(medical-student) బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసన్ అండ్ సర్జరీ (BAMS) ఫైనల్ ఇయర్ చదువుతోంది.
ఆ కాలేజీలో డాక్టర్ రాజు అనే లెక్చరర్‌తో నిఖిత చదువు విషయంలో చొరవగా మాట్లాడేది. దీంతో నిఖిత క్లాస్‌మెట్స్ కొందరు ఆమెకు, ఆ లెక్చరర్ మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు పదేపదే ఆమెను అవమానించేలా మాట్లాడారంటూ నిఖిత తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
ఇలాంటి తప్పుడు మాటలను పట్టించుకోకుకండా చదువుపై ఫోకస్ పెట్టాలని తమ కూతురుకు ధైర్యం చెప్పామని అయినప్పటికీ తోటి విద్యార్థులు వేధించారంటూ వాపోయారు. ఆ మనస్థాపంతోనే నిఖిత ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు గదిలో సూసైడ్ లేటర్ కూడా దొరికిందని.. అందులో తన మరణానికి కారణమైన విద్యార్థుల పేర్లు చెప్పిందని చెప్పారు. వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read
- మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- AstrologyTips: దరిద్రాన్ని ఆహ్వానించే అలవాట్లు.. సాయంత్రం పూట పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!
- ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారు జాగ్రత్త.. ఏ పని చేసినా దరిద్రమే, దురదృష్టమే!
- Karnataka: ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు.. విద్యార్థిని సూసైడ్





