మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు(అజ్జు, శ్రీనివాస్) పోలీసుల అదుపులో ఉన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కీసర మండలం రాంపల్లికి చెందిన గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి ఘట్కేసర్కు వస్తున్న క్రమంలో బహుదూర్పురకు చెందిన ఇబ్రహీం వెంబడించాడు. యంనంపేట వద్ద కారును అడ్డగించి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే సోనూ సింగ్పై నిందితుడు రెండు రౌండ్ల కాల్పులను జరిపాడు. దీంతో ఆయన పక్కటెముకల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి గాయమైంది.
అనంతరం, స్థానికులు బాధితుడిని హుటాహుటిన మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ, అతడికి సర్జరీ చేశారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించి పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా సీపీ తెలిపారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో