December 20, 2024
SGSTV NEWS
CrimeTelangana

Medak: అమానవీయ ఘటన.. దిష్టి సామగ్రి రోడ్డుపై వేశారని..

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఓ మహిళ దిష్టి తీసి, ఆ వస్తువులను రోడ్డుపై పడేశారు. ఇది గమనించిన కొందరు గ్రామస్థులు కోపోద్రిక్తులై వారిద్దరితోపాటు మరో మహిళను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు.



టేక్మాల్, : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఓ మహిళ దిష్టి తీసి, ఆ వస్తువులను రోడ్డుపై పడేశారు. ఇది గమనించిన కొందరు గ్రామస్థులు కోపోద్రిక్తులై వారిద్దరితోపాటు మరో మహిళను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఆపై ఊరి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో ముగ్గురూ గాయాలతో జోరువానలో బిక్కుబిక్కుమంటూ శివారులోని ఓ చెట్టు కిందకు చేరారు. పోలీసులు చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అప్పటికే మృతిచెందగా.. మహిళలిద్దరూ చికిత్స పొందుతున్నారు. ఈ అమానవీయ ఘటన మంగళవారం మెదక్ జిల్లా టేక్మాల్ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో జరిగింది. ఏఎస్సై దయానంద్ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం మందాపూర్ గ్రామానికి చెందిన దేవునికాడి రాములు(65) మెదక్ పట్టణంలో నవపేట చెందిన వెంకటలక్ష్మిని వివాహం చేసుకుని ఇల్లరికం వెళ్లారు. ఒగ్గుకథలు చెబుతూ కుటుంబాన్ని పోషించేవారు.

ఈ నెల 1న సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచిపల్లికి చెందిన పరిచయస్థురాలు బాలమణిని తీసుకొని గొల్లగూడెంలోని మేనకోడలు బురుజుకింది గంగమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం నుంచి రాములుకు విరేచనాలు అవుతుండటంతో టేక్మాల్ పీహెచ్సీ, బొడ్మట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున బాలమణి రాములుకు దిష్టి తీసి ఆ వస్తువులను రోడ్డు వద్ద ఉంచారు. స్థానికులు కొందరు గమనించి బాలమణి. గంగమ్మలతోపాటు రాములును ఇంట్లో నుంచి తీసుకువచ్చి ఇష్టారీతిన కొట్టారు. అనంతరం రాములును ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పడంతో ముగ్గురూ గ్రామ శివారుకు వచ్చారు. గాయాలతో వర్షంలో తడుస్తూ కూర్చున్న వారిని చూసి కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకొని 108లో వారిని జోగిపేట ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాములు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అతని కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via