అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యారని సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్కు చెందిన మేఘన(18) స్థానిక మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది.
కాగా సోమవారం సాయంత్రం కళాశాల ఆవరణలోని గ్రౌండ్లో స్నేహితులతో కలిసి ఉండగా.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను కళాశాల ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తల్లిదండ్రులు చేరుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందింది. విద్యారని తండ్రి బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు.
Also Read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





