గబ్బిలాలు వీటి గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు. వీటి పేరు చెపితే అణువణువునా భయం పుడుతుంది. ఎందుకంటే యావత్తు ప్రపంచాన్ని వణికించి.. ఎంతో మంది ప్రాణాలు తీసిన కరోన మహమ్మారి ఈ గబ్బిలాల నుండి వచ్చిందే. కానీ ఈ గబ్బిలాలు కొంతమందికి జీవనోపాధిగా ఉపయోగపడుతున్నాయి. ఏంటి ఈ గబ్బిలాల స్టోరీ అనుకొంటున్నారా అయితే చూడండి.
గబ్బిలాలు వీటి గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు. వీటి పేరు చెపితే అణువణువునా భయం పుడుతుంది. ఎందుకంటే యావత్తు ప్రపంచాన్ని వణికించి.. ఎంతో మంది ప్రాణాలు తీసిన కరోన మహమ్మారి ఈ గబ్బిలాల నుండి వచ్చిందే. కానీ ఈ గబ్బిలాలు కొంతమందికి జీవనోపాధిగా ఉపయోగపడుతున్నాయి. ఏంటి ఈ గబ్బిలాల స్టోరీ అనుకొంటున్నారా అయితే చూడండి. గబ్బిలాలు ఇవి ఎక్కువుగా గుహల్లో, పాత పాడుబడిన దేవాలయాల్లో,పెద్ద పెద్ద వృక్షాలపై నివాసిస్తుంటాయి. కొందరు ఇళ్లలోకి వస్తే లక్ష్మీదేవి వస్తుందంటారు. మరికొంత మంది దెయ్యం పక్షి అంటారు. దీని శబ్దాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. కానీ కొంతమంది ఈ గబ్బిలాల కోసం ఎంతో కష్టబడుతూ రాత్రుళ్ళు వీటి కోసం అన్వేషిస్తుంటారు. ఈ గబ్బిలాలలో ఉండే ఎముక,నీరసంగా ఉన్నవారికి దెయ్యం పట్టిన వారికి చిన్న పిల్లలకు కడితే, దుష్టగ్రహాల నుండి రక్షణ ఉంటుందని కొంతమంది నమ్మకం.
అందుకోసం ఈ గబ్బిలాల వేట ఎంతో ప్రయాసతో రాత్రంతా కష్టబడి వాటిని పట్టుకొని వాటి ఎముకలను సేకరిస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతంలో ఒక తెగకు సంబంధించిన వారు గబ్బిలాల వేటలో తిరుగుతూ వాటి జాడ వెతుకుతూ, అవి ఎక్కడ ఉన్నా వాటి కోసం అన్వేషిస్తూ వాటి జాడ కనిపెడతారు. అవి రాత్రులు చెట్లపైకి చేరుకున్న వెంటనే ఎంతో ఎత్తులో చెట్లకు మధ్య ఒక వల ఏర్పాటు చేసి, చెట్లపై ఉన్న గబ్బిలాలను చెదరకొడతారు. అవి చేదిరిపోయి వలలో చిక్కుకొంటాయి. వలలో చిక్కుకొన్న గబ్బిలాలను పట్టుకొని సంచిలో వేసుకొని ఇంటికి తీసుకువెళ్లి వాటి ఎముకలను సేకరించి ఆ ఎముకలతో తాయత్తులు తయారు చేసి వారి వద్దకు వచ్చేవారికి ఈ తాయత్తులు అమ్ముకొని జీవనం సాగిస్తారు. ఏదేమైనా ఎవరి నమ్మకం వారిది.
Also read
- Andhra: బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్…. M
- Telangana: భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..
- Crime: తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య
- Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!
- గుంటూరు: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే