SGSTV NEWS online
Andhra Pradesh

హక్కుల రక్షణ కై పోరాడటమే మేడే స్ఫూర్తి……కారింకి శ్రీనివాస్, ఉపాధ్యాయ ఉద్యమ నేత.


        నిడదవోలు లో ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా యర్నగూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద నిర్వహించిన బహిరంగ సభ. ముఖ్య వక్తగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారింకి శ్రీనివాస్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం కార్మికులు,ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను పాలకులు కాల రాస్తున్నారనీ, కనీస వేతనాలు, బోనస్, పి.ఎఫ్ తదితరాలను పొందేందుకు కార్మికవర్గం మేడే స్ఫూర్తితో పోరాడాలన్నారు.
      ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర బాబు లు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి కార్మికులు పోరాడి అనుభవిస్తున్న చట్టాలను మోడి ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్ ల ద్వారా కార్పొరేట్ అనుకూల విధానాల తో కార్మిక వర్గానికి వేసిన సంకెళ్లు తెంచేందుకు నాటి  మేడే పోరాటాన్ని కొనసాగించాలన్నారు.
      ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యులు రవ్వ సురేష్ కుమార్, కోనేటి మల్లేశ్వర రావు, రామిరెడ్డి లు మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాల కోసం మేడే స్ఫూర్తి గా పోరాడాలని పిలుపునిచ్చారు.


    సభలో వేదికపై  ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం పెండ్యాల ప్రెసిడెంట్ సురేష్  , శెట్టిపేట సంఘం సెక్రటరీ రావి వరహాల స్వామి, కోరు పల్లి సంఘం నాయకులు నిచ్చెన కోళ్ళ దుర్గారావు, కలవ చర్ల యూనియన్ ప్రెసిడెంట్ మల్లిపూడి రామచంద్ర రావు, గౌతమి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ మల్లిడి రామిరెడ్డి, కోరు పల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం, సామిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చేకూరి శ్రీనివాస్, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొమ్మోజు శేఖర్, వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గాలి గని రాజు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాము, శింగవరం యూనియన్ నాయకులు నూతంగి రమేష్, లు ఆసీనులై కార్మికుల నుద్దేశించి ప్రసంగించారు.
     అనంతరం జరిగిన ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా గ్యాస్ కొరతతో ప్రజలు రాతి యుగం నాటి కట్టెల పొయ్యి ల కాలానికి దిగజారారంటూ కట్టెల పొయ్యి లు,  మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెచ్చరిల్లిన మత ఉన్మాదానికి సూచనగా మతోన్మాద భూతం కటౌట్ ను, నాజీ నియంతల పాలన తరహాలో ఫాసిజపు రాక్షసత్వపు కటౌట్ లతో ర్యాలీ లో ప్రదర్శించారు.
      పై ర్యాలీ కి లంకాడ గణపతి, పిచ్చా సూర్య కిరణ్, పాఠం శెట్టి రాజేష్, రాము కారింకి రమేష్, వాకా సత్య నారాయణ, నాగరాజు , సుబ్బారావు, సిర్రా వీర రాఘవులు, బాపినీడు తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts