April 16, 2025
SGSTV NEWS
CrimeNational

Drugs Overdose: థ్రిల్లింగ్‌ కోసం డ్రగ్స్‌.. ఓవర్‌ డోస్‌ కావడంతో యువతి మృతి

లక్నో, ఏప్రిల్‌ 10: డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కారణంగా 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్నాటకలోని లక్నోలోని తివారీగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే ఓ యువతి (18) ఏప్రిల్ 3న లక్నోలోని తన ఇంటికి వెళ్లింది. ఏప్రిల్ 7న తిరిగి బెంగళూరుకు వెళ్లే క్రమంలో తన స్నేహితుడు వివేక్ మౌర్యను కలిసింది. వీరిద్దరూ కలిసి సోమవారం సాయంత్రం ఓ ప్లాట్‌కు వెళ్లారు. డ్రగ్స్‌ తీసుకుంటే బలే థ్రిల్లింగ్‌గా ఉంటుందని వివేక్‌ యువతికి చెప్పాడు. అనంతరం ఓ సిరంజితో ఆ యువతికి ఇంజెక్ట్‌ చేశాడు. డ్రగ్స్‌ మోతాదు ఎక్కువ కావడంతో కాసేపటికే యువతి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. భయాందోళనలకు గురైన వివేక్‌ తాను కూడా డ్రగ్స్‌ తీసుకుని మత్తులో ఉండటంతో పోలీసులకు ఫోన్‌ చేసి సహాయం కోరాడు.


పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఈ విషయం తెలియగానే యువకుడు భయంతో ఆసుపత్రి నుంచి పారిపోయాడు. పోలీసులు అతడిని ఇందిరా కెనాల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గతంలో వివేక్ ఇంట్లో ఆ యువతి కుటుంబం అద్దెకు ఉండేవారని, వివేక్‌ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడని, ఆమెను కూడా మాదకద్రవ్యాలు తీసుకోవాలంటూ కోరేవాడని విచారణలో తేలింది.

అయితే తమ కుమార్తెను కావాలనే హత్య చేసి ఉండవచ్చని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతే థ్రిల్‌ కోసం తనకు డ్రగ్స్‌ ఇవ్వాలని కోరిందని, ఎక్కువ మోతాదు ఉన్న డ్రగ్‌ను మొదట తాను తీసుకుని, ఆ తర్వాత ఆ యువతికి ఇంజెక్ట్‌ చేసినట్లు వివేక్‌ తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share via