మంచిర్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 హట్స్ ఏరియాకు చెందిన మేరుగు సౌమ్య (22)కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది.
యువతి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందగా తల్లి కీర్తనతో కలిసి ఉంటుంది. సోమవారం సాయంత్రం కీర్తన సంతకు వెళ్లిన సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంటి పైకప్పుకు ఉరేసుకుంది. తనకు పెళ్లంటే ఇష్టం లేదని, జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సారీ మమ్మీ.. సారీ డాడి అని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





