SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్‌లో దారుణం.. యజమాని మర్మాంగాలు కొరికి చంపిన కుక్క!

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మధురానగర్‌లో ఉంటూ ఓ కుక్కను పెంచుకుంటున్న పవన్ కుమార్‌.. దాని చేతిలోనే హతమయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. పవన్ మర్మాంగాలు కొరికిన ఆనవాలు కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు

పెట్ డాగ్స్ అంటే అందరికీ ఇష్టమే. వాటిని పెంచుకుంటూ.. వాటితోనే రోజంతా గడుపుతుంటారు. అలా పెంచుకుంటున్న ఓ కుక్క దారుణానికి పాల్పడింది. తన యజమాని ప్రైవేట్ పార్ట్స్‌ను అత్యంత దారుణంగా కొరికేసి చంపేసింది. అయితే ఈ విషయంలో కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించాడని కొందరు అనుకుంటున్నారు. కానీ పెంపుడు కుక్క కరిచిన ఆనవాళ్లు కనిపించడంతో.. కుక్కే చంపి ఉంటుందని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వతే అసలు నిజం బయటకు రానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


పెంచుకున్న కుక్కే కాటేసింది
ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 35 ఏళ్ల పవన్ కుమార్‌ ఐదేండ్ల కిందట తన భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ జ్యువెల్లరీ షాప్‌లో క్యాషియర్ గా పనిచేస్తూ మధురానగర్ ఈ బ్లాక్‌లో నివాసముంటున్నాడు. అతడు తనకు తోడుగా సైబీరియన్హస్కీ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.

అయితే గత కొద్ది రోజుల క్రితం అతడు అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇందులో భాగంగానే ఆదివారం (మే4) మధ్యాహ్నం పవన్ స్నేహితుడు సందీప్ అతడి ఇంటికి వెళ్లాడు. తలుపులు వేసి ఉండటంతో చాలా సార్లు డోర్ కొట్టాడు. కానీ లోపల ఉన్న పవన్ తెరవలేదు. దీంతో సమీపంలో ఉన్న ఇంటి వారిని పిలిచి డోర్లు బద్దలు కొట్టారు. వెంటనే లోపలకు వెళ్లి చూడగా అప్పటికే పవన్ కుమార్ విగతజీవిగా పడి ఉన్నాడు

అయితే అక్కడే పవన్ కుమార్ మర్మాంగాల వద్ద కుక్క కొరికిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ పక్కనే కుక్క నోటికి రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్ట్ నిమిత్తం డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న పవన్ కుమార్ గుండెపోటుతో మరణించి ఉంటాడని.. అయితే పవన్ ఎంత సమయానికి లేవకపోవడంతో యజమానిని లేపే క్రమంలో పెంపుడు కుక్క అతడి ప్రైవేట్ పార్ట్స్ కొరికి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Also read

Related posts