పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండలో ఫార్మసీ విద్యార్థినిపైప్రియుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.నర్సరావుపేట ఏఎంరెడ్డి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న గ్రీష్మ, మల్లిఖార్జున్ ప్రేమికులు. అయితే గీష్మ మరో యువకుడితో మాట్లాడుతుందని కోపంతో దాడిచేశాడు.
Lover Attack : పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండలో ఫార్మసీ విద్యార్థినిపై ప్రియుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. నర్సరావు పేట ఏఎం రెడ్డి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న గ్రీష్మ మల్లిఖార్జున్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే గీష్మ ఈ మధ్య మరో యువకుడితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు మల్లిఖార్జున. తనతో మాట్లాడేది ఉందని చెప్పి గుత్తికొండ సమీపంలోని అటవీప్రాంతానికి గ్రీష్మను తీసుకెళ్లాడు.
కాగా ఇద్దరి మధ్య మాటమాట పెరిగి విచక్షణ కోల్పొయిన మల్లిఖార్జున కర్రతో గ్రీష్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో గ్రీష్మకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రీష్మ కేకలు వేయడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనను వారికి చెప్పడంతో ప్రియుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం గ్రీష్మను చికిత్స కోసం నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు