SGSTV NEWS
Andhra PradeshCrime

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి.. దుండగులపై పోలీసుల కాల్పులు!


గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్‌లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు

Train: గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్‌లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన  రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడినుంచి పారిపోయారు.

వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దొరకుండా పారిపోవడంతో వారికోసం గాలిస్తున్నారు. వరుసగా రైళ్ళలో చోరికి పాల్పడుతున్న వారిని బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్ లుగా అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు గుర్తించారు. వారం రోజుల్లో రెండుసార్లు తెల్లవారుజామునే చోరికి పాల్పడేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

Also read

Related posts

Share this