హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాక్షికంగా కాలిపోయిన బాటిళ్ల కోసం, కింద పడిన మద్యం కోసం స్థానికులు ఎగబడ్డారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ ఉత్సవాలు(Dasara Celebrations 2025) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆయుధ పూజలు ఘనంగా జరుపుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు రేపు (అక్టోబర్ 2) ఆయుధ పూజలు జరుపుకోనున్నారు. అదే సమయంలో బంధు మిత్రులతో కలిసి చుక్కా ముక్క ఏర్పాటు చేసుకుని సందడి సందడిగా ఎంజాయ్ చేయనున్నారు. ప్రతి ఏటా ప్రజలు తమ కుటుంబంతో కలిసి ఇలానే చుక్కా ముక్కతో డ్యాన్సులు చేస్తూ హ్యాపీగా ఉంటారు
Liquor Vehicle Accident At Ramanthapur
కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దసరా పండుగ(Dasara 2025) నాడే అంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి. ఆ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు మూసివేస్తారు. దీంతో చాలామంది మద్యం ప్రియులు, మాంసం ప్రియులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వాలు సైతం అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆ రోజున ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
దీంతో ప్రజలు ఒక్క రోజు ముందుగానే అంటే ఇవాళే మద్యం షాపుల వద్ద క్యూ కట్టారు. దెబ్బకు పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. చాలా మంది తమకు కావాలసిన స్టాక్‌ను ముందుగానే కొనుక్కొని స్టోర్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో దుకాణాల్లో ఉన్న స్టాక్ మొత్తం ఒకవైపు ఖాళీ అవుతుండగా.. మరోవైపు యజమానులు షాపులకు కావాల్సిన మద్యాన్ని సరఫరా చేసుకుంటున్నారు. గంట గంటకి మద్యం వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి.
అదే సమయంలో హైదరాబాద్‌లో ఒక లారీ ప్రమాదానికి(Liquor vehicle accident) గురైంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన రామంతాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్(hyderabad) లోని రామంతాపూర్ ప్రాంతంలో మద్యం లోడుతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదానికి గురైంది. ఆ లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో లారీ డ్రైవర్ ముందుగానే ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. వెంటనే లారీని పక్కకు నిలపాడు. అనంతరం స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చాడు. ఈ ఘటనలో చాలా బాటిళ్లు కాలిపోయాయి. అదే సమయంలోనే లారీలోని కొన్ని మద్యం బాటిల్లు మిస్ అయ్యాయి. మంటలు ఆర్పే సమయంలో కొంతమంది లారీలో ఉన్న మద్యం బాటిళ్లను పట్టుకుపోయారు. ప్రజలు గుంపులు గుంపులుగా లారీ వద్దకు చేరుకుని.. కింద పడిపోయిన బాటిళ్లు, డబ్బాలను పట్టుకుని పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట సంచలనంగా మారింది.
Also read
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
- చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..