March 5, 2025
SGSTV NEWS
LifestyleVastu Tips

Vastu Tips: తలుపు వెనకాల బట్టలు తగిలిస్తున్నారా.. దీని వల్ల ఎన్ని అనర్థాలో చూడండి..



భారతీయ సంప్రదాయాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మన చుట్టూ ఉండే ప్రతి వస్తువు ప్రత్యక్షంగా పరోక్షంగా మన జీవితంమీద ప్రభావం చూపుతుంటాయి. వాటి ఎనర్జీ మన మీద ఏదో ఒక విధంగా పనిచేస్తుంటుంది. అందులో మనం తెలియక చేసే చిన్న పొరపాట్లు మన ఇంటి వాతావరణాన్ని చెడగొడుతుంటాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నా.. మనశ్శాంతి కరవైనా ఓ సారి మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి

మనం తరచుగా చిన్న చిన్న విషయాలే కదా అని కొన్నింటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. ఇవే మన జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇవి ప్రమాదకరం కాకపోయినా ఈ అలవాట్లు మనల్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయి. అందులో తలుపుల వెనుక బట్టలు వేలాడదీయడం కూడా ఒకటి. వాస్తు శాస్త్రంలో చెప్తున్న విషయాల ప్రకారం ఈ అలవాటు ఏ ఇంటికైనా మంచిది కాదట. దీని వలన ఆ ఇల్లు, ఇంట్లోని వారు కష్టాలు పడాల్సి వస్తుందని చెప్తున్నారు. మరి తలుపుల మీద బట్టలు వేయడానికి ఈ సమస్యలకు ఉన్న సంబంధం ఏమిటి.. వీటి వల్ల కలిగే అనర్థాలేంటో చూసేయండి.

తలుపుల వెనుక బట్టలు వేలాడదీయాలా?
“వాస్తు శాస్త్రం ప్రకారం, తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం అశుభంగా పరిగణిస్తారు. ఈ అలవాటు ఆ ఇంట్లో వాస్తు దోషానికి దారితీస్తుంది. మీ ఇంటిలోని ప్రతి తలుపు సానుకూల శక్తికి ప్రవేశ మార్గంగా వాస్తు శాస్త్రం చెప్తుంది. ప్రతికూల శక్తి కూడా తలుపుల గుండానే బయటకు వెళ్లిపోతుందట. తలుపుల వెనుక, ఇంటి డోర్ల మీద బట్టలు వేలాడదీయడం వల్ల శక్తి ప్రవేశాన్ని ఇవి అడ్డుకుంటాయని చెప్తారు.

నెగిటివ్ ఎనర్జీకి మూలం..
తలుపు వెనుక వేలాడదీసిన బట్టలు శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి, చివరికి అశాంతి, ఒత్తిడి, ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి. తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం వల్ల ఇంటి వాతావరణం చిందరవందరగా మారుతుంది. ఇది చిందరవందరగా కనిపించడమే కాకుండా మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలకు కూడా ఆటంకం కలిగిస్తుంది.

ఆరోగ్య సమస్యలు..
మురికి బట్టలు తలుపు వెనుక ఎక్కువసేపు వేలాడదీయడం వల్ల అక్కడ దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. ఇది ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ అలవాటు ఇంట్లో ఆ ప్రదేశంలో వాస్తు దోషానికి కూడా కారణమవుతుంది. ఈ లోపం కుటుంబ సభ్యుల సంబంధాలు, సామర్థ్యం మరియు శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అని  పండితులు అన్నారు

మనశ్శాంతిని దూరం చేయగలదు..
తలుపు వెనుక బట్టలు వేలాడదీసే అలవాటు హానికరం మాత్రమే కాదు, మీ జీవితంపై మానసికంగానూ ప్రభావాన్ని చూపుతుంది. తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం వల్ల మీకు ఎల్లప్పుడూ చిందరవందరగా అనిపిస్తుంది. మీరు ఈ దుస్తులను చూసినప్పుడల్లా, అవి మీ మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది మీ మనస్సును అస్థిరపరుస్తుంది. మీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

Also read

Related posts

Share via